శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలం వెదుళ్లవలసలో జరిగిన దారుణంపై డీఎస్పీ సీహెచ్ వివేకానంద మంగళవారం సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. తల్లి తన ఇద్దరు పిల్లల గొంతు కోసి, అనంతరం తాను కూడా ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటనపై స్థానిక పోలీసుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఘటన జరిగిన పరిస్థితులను సమగ్రంగా పరిశీలించి, అన్ని కోణాల్లో విచారణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు.