విశాఖపట్నం పోర్ట్ స్టేడియంలోని కళావాణి ఆడిటోరియంలో శనివారం నిర్వహించిన ప్రధాని వికసిత్ భారత్ రోజ్ ఘర్ మేళాని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు జ్యోతి ప్రజ్వలనం చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువతకి ప్రధాని అందించిన అమూల్య కానుక రోజ్గార్ యోజన కార్యక్రమం అని అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్ గా వికసిత్ భారత్ రోజ్గార్ యోజన కార్యక్రమంలో భాగస్వామి అయ్యారు.