శ్రీకాకుళం జిల్లా హిరమండలం మండలం పరిధిలోని ధనుపురం గ్రామం వద్ద పొగడవెల్లి గడ్డ మీద 29 లక్షల ఎన్. ఆర్. ఈ. జి. ఎస్ నిధులతో నిర్మించిన చెక్ డ్యామ్ ను కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు సోమవారం ప్రారంభించారు. స్థానిక ఎమ్మెల్యే మామిడి గోవిందరావు, కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, జిల్లా బిజెపి అధ్యక్షులు సిరిపురం తేజేశ్వర రావు, టిడిపి శ్రేణులు పాల్గొన్నారు.