శ్రీకాకుళం జిల్లా టెక్కలి సమీపంలో రావివలస వద్ద బుధవారం ఉదయం జరిగిన రైలు ప్రమాద దుర్ఘటనపై కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన నాయుడు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసారు. ప్రమాదానికి గల కారణాలను ఆయన రైల్వే అధికారులు, రెవెన్యూ అధికారులను అడిగి తెలుసుకున్నారు. మృతుల కుటుంబాలకు తన సానుభూతిని, సంతాపాన్ని తెలిపారు. క్షతగాత్రునికి మెరుగైన వైద్యo అందించాలని ఆయన ఆదేశించారు.