వంగర మండలంలో మంగళవారం పలు గ్రామాల్లో వాయుగుండ తుఫాను ప్రభావం వల్ల ఉదయం నుండి ఓ మోస్తరు వర్షం కురుస్తుంది. ఎండాకాలంలో వర్షాలు పడటం వలన వచ్చే నెలలో వరి నాట్లు వేసే సమయానికి వర్షాలు పడతాయో లేదో అని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పుడు పడిన వర్షాల వల్ల ఎండాకాలంలో పొలాలు దున్నుకోడానికి కూడా వీలు పడటం లేదని అరసాడ, భాగం పేట, నీలయ్యవలస, మడ్డువలస వంగర పరిసర ప్రాంత రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.