శ్రీకాకుళాన్ని దేశానికే ఆదర్శంగా నిలిపేందుకు కృషి చేస్తానని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు గారలోని జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో గురువారం జరిగిన మెగా పేరెంట్ టీచర్ డే సమావేశంలో అన్నారు. వలసలు లేని జిల్లాగా మార్చేందుకు, పారిశ్రామిక అభివృద్ధికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. తన తండ్రి ఎర్రన్నాయుడు చదివిన బడికి రావడం ఆనందంగా ఉందన్నారు.