నాగావళిలో యువకుడు గల్లంతు

శ్రీకాకుళం నగరంలో వినాయక చవితి నిమజ్జనోత్సవంలో విషాదం చోటుచేసుకుంది. పెద్దరెల్లివీధికి చెందిన మాడుగుల షణ్ముఖ్, వినాయక విగ్రహాన్ని కొత్తవంతెన వద్ద నదిలో నిమజ్జనం చేస్తున్న సమయంలో శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత నదిలో పడ్డారు. తోటి స్నేహితులు వెంటనే పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. తెల్లవారుజాము వరకు గాలింపు చేపట్టినా ఆచూకీ లభించలేదు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕