శ్రీకాకుళం జిల్లా గార మండలం జొన్నలపాడు గ్రామానికి చెందిన పల్ల అప్పలస్వామి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న వైసీపీ యువనేత ధర్మాన రామ్మనోహర్ నాయుడు సోమవారం సాయంత్రం మృతుడి కుటుంబాన్ని పరామర్శించి, వారికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. పార్టీ తరఫున అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఆయన వెంట మాజీ సర్పంచ్ చిన్నబాబు, మాజీ ఎంపీటీసీ శ్రీనివాసరావు, పల్ల సూరిబాబు, రాంబాబు, జాడ పాపారావు, సోడిముడి రాము ఉన్నారు.