టెక్కలిలో ప్రమాదకరంగా కల్వర్టు

టెక్కలి మండల కేంద్రం పరిధిలోని చిన్నబజార్ రోడ్డులో రాందాసుపేట వీధి వద్ద కాలువ కల్వర్టు ప్రమాదకరంగా ఉంది. గత కొద్ది రోజుల క్రితం కాలువలో పూడికతీత కోసం స్థానిక పంచాయతీ సిబ్బంది కల్వర్టును రంధ్రం చేసి పూడికలను తొలగించారు. అయితే తదుపరి పరిష్కార చర్యలు చేపట్టకపోవడంతో కల్వర్టు ప్రమాదకరంగా మారి ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు తెలిపారు. పంచాయతీ అధికారులు చర్యలు తీసుకోవాలని బుధవారం స్థానికులు కోరారు.

సంబంధిత పోస్ట్