ప్రేమ విఫలమైందని ఓ యువకుడు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండలంలోని నరసాపురం గ్రామంలో శనివారం చోటు చేసుకుంది. పొన్నాడ శ్రీనుకి ఓ యువతి పరిచయమై అది ప్రేమగా మారింది. అయితే ఆమె శ్రీనుతో వివాహానికి నిరాకరించింది. దీంతో మనస్తాపానికి గురైన శ్రీను శనివారం ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఎస్‌ఐ నారాయణ స్వామిని సంప్రదించగా.. ఎటువంటి ఫిర్యాదు రాలేదన్నారు.