టెక్కలి మండలం రావివలస పాత కాలనీకి చెందిన అక్క తమ్ముళ్లు అయిన పీ. శేఖర్, పీ. లక్ష్మీల పై అదే గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు మంగళవారం దాడిచేసినట్లు బాధితులు తెలిపారు. మంగళవారం ఉదయం గ్రామంలో జరిగిన ఓ చిన్నపాటి ఘర్షణ దాడికి దారి తీసింది. దీంతో ఇద్దరు యువకులు దాడికి పాల్పడినట్లు స్థానికులు తెలిపారు. ఈ దాడిలో నాలుగు నెలలు గర్భిణీ లక్ష్మీ గాయపడగా చికిత్స నిమిత్తం టెక్కలి జిల్లా ఆసుపత్రికి తరలించారు.