సంతబొమ్మాలి శాఖ గ్రంధాలయంలో గురజాడ జయంతి వేడుకలు

శ్రీకాకుళం, టెక్కలిలోని సంతబొమ్మాలి శాఖా గ్రంధాలయంలో శ్రీ గురజాడ వెంకట అప్పారావు 64వ జయంతి కార్యక్రమం సోమవారం జరిగింది. గ్రంధాల అధికారి కే రామకృష్ణ ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. కన్యాశుల్కం నాటకంతో ప్రఖ్యాతలు గాంచిన గురజాడ అభ్యుదయ కవి, కవి శేఖర బిరుదాంకితులు. ఆయన గొప్ప సాహితీవేత్తగా, మహాకవిగా సాంఘిక పరివర్తనకు ఎన్నో రచనలు చేశారు. ఈ కార్యక్రమంలో రీడర్స్, ఎంపీపీ స్కూల్ విద్యార్థులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕