శ్రీకాకుళం: పొలాల్లోకి దూసుకెళ్లిన భారీ కంటైనర్

కోటబొమ్మలి మండలం తర్లిబొడ్డపాడు గ్రామ సమీప జాతీయ రహదారిపై బుధవారం తెల్లవారుజామున ఓ కంటైనర్ బోల్తా కొట్టింది. అమలాపురం నుంచి భువనేశ్వర్ వెళుతున్న కంటైనర్ డివైడర్ ను దాటుకుంటూ పొలాల్లోకి దూసుకుపోయింది. ఆ సమయంలో వాహనాలేవి రాకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో డ్రైవర్ కి చిన్నపాటి గాయాలయ్యాయి. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

సంబంధిత పోస్ట్