కోటబొమ్మాళి: రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి తీవ్రగాయాలు

కోటబొమ్మాళి జాతీయ రహదారిపై ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో గుణుపూర్కు చెందిన జామి రాజేష్, అఖిలకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల వివరాల మేరకు నరసన్నపేట నుంచి టెక్కలి వైపు బైక్ పై వెళ్తున్న క్రమంలో వెనుక నుంచి గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. గాయపడ్డ వారిని కోటబొమ్మాళి ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చారు. ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన చికిత్స కోసం శ్రీకాకుళం తరలించారు.

సంబంధిత పోస్ట్