టెక్కలిలో మంగళవారం, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ విచారణ నిమిత్తం కొత్తూరు పోలీస్ సర్కిల్ కార్యాలయానికి హాజరుకానున్న నేపథ్యంలో, ఆయన సన్నిహితురాలు దివ్వెల మాధురిని పోలీసులు గృహ నిర్బంధం చేశారు. తన వ్యక్తిగత పనుల నిమిత్తం బయటకు వెళ్లడానికి మాధురి అనుమతి కోరినప్పటికీ, పోలీసులు ఆమెను అడ్డుకున్నారు. దువ్వాడ ఇంటి వద్ద కూడా పోలీస్ బందోబస్తు కొనసాగుతోంది.