నందిగామ మండలం పెద్ద తామరపల్లి సర్పంచి దేవు మనుమరాలు మరియు స్థానిక ఎంపీటీసీ సైలాడ లావన్న అలాగే పెదతామరపల్లి సీనియర్ వైసీపీ నాయకులు తమరి వివేకానందలు అనారోగ్యంతో బాధపడుతున్నారన్న విషయం తెలుసుకొని బుధవారం స్థానిక ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వారిని పరామర్శించి వారిలో ధైర్యాన్ని పెంచారు. కార్యక్రమంలో సర్పంచ్ దేవు, మాజీ పిఎసిఎస్ అధ్యక్షుడు బలరాం, పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు.