విజయవాడలో జరిగిన ఏపిసిపిఎస్ఈఏ (APCPSEA) కార్యవర్గ సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షునిగా సంతబొమ్మాలి మండలానికి చెందిన ఉపాధ్యాయుడు రెడ్డి సూరిబాబు ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా రెడ్డి సూరిబాబు మాట్లాడుతూ పాత పెన్షన్ విదానం పునరుద్ధరించే వరకు ఏపిసిపిఎస్ఈఏ పోరాటం చేస్తోందన్నారు. సిపిఎస్ ఉద్యమకారులపై గల క్రిమినల్ కేసులు ఎత్తివేసి సీపీఎస్ రద్దు కు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.