అదుపుతప్పిన ఆర్టీసీ బస్సు

శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం ఇజ్జువరం వద్ద మంగళవారం ఆర్టీసీ బస్సు అదుపు తప్పింది. నౌపడ ఆర్‌ఎస్‌ సమీపంలో ఎదురుగా గొర్రెల మంద రావడంతో వాటిని తప్పించబోయి.. రోడ్డు పక్కన పైపులైన్ల నిర్మాణం కోసం తవ్విన గోతిలో దిగబడింది. సమీపంలో ఉన్న 13కేవీ లైన్‌ విద్యుత్‌ స్తంభానికి కొంచెం తగిలి.. బస్సు నిలిచిపోయింది. ప్రమాద సమయంలో ఆర్టీసీ బస్సు 30 మంది ప్రయాణికులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్