సంతబొమ్మాలి: అరటిగెలలు సంబరంలో అపశ్రుతి..తప్పిన ప్రమాదం

సంతబొమ్మాళి మండలం చెట్లతాండ్రలోని శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయ ప్రాంగణంలో శనివారం జరిగిన అరటిగెలలు సంబరంలో అపశ్రుతి చోటుచేసుకుంది. భీష్మ ఏకాదశి సందర్భంగా ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన అరటిగెలల పందిరి శనివారం మధ్యాహ్నం 2. 45 గంటల సమయంలో ఒక్కసారిగా కుప్పకూలింది. ఆ సమయంలో పందిరి కింద ఒక్కరు కూడా లేకపోవడంతో ప్రమాదం తప్పిందని భక్తులు ఊపిరిపీల్చుకున్నారు. పోలీసులు, గ్రామస్థులు సహాయక చర్యలు చేపట్టారు.

సంబంధిత పోస్ట్