శ్రీకాకుళం: ఘోర ప్రమాదం.. రైలు ఢీకొని నలుగురు మృతి

శ్రీకాకుళం జిల్లాలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. బుధవారం టెక్కలి మండలంలోని రావివలస సమీపంలో రాజ్యరాణి ఎక్స్ప్రెస్ రైలు ఐదుగురిని ఢీకొంది. ఈ ప్రమాదంలో నలుగురు యువకులు అక్కడికక్కడే మరణించగా మరోకోరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు, రైల్వే అధికారులు ఘటనాస్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపడుతున్నారు. బహిర్భూమికి వెళ్ళేటపుడు రైలు ట్రాక్ వద్దకు రాగానే రైలు వస్తుందని గుర్తించే లోపు రైలు దూసుకెళ్లింది. క్షతగాత్రుడ్ని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించగా మృతదేహాలను పోస్ట్ మార్టంకు తరలించారు.

సంబంధిత పోస్ట్

✕
✕