నిలిచిన మూలపేట పోర్టు వాహనాలు.. స్తంభించిన ట్రాఫిక్

సంతబొమ్మాలి మండలం మూలపేట పోర్టు నిర్మాణంలో భాగంగా తిరుగుతున్న భారీ వాహనాలతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. సోమవారం తెల్లవారుజామున పోర్టు భారీ వాహనాలతో హెచ్ ఎన్ పేట సమీపంలో నిలిచిపోవడంతో ట్రాఫిక్ కి అంతరాయం ఏర్పడింది. దీంతో అటుగా వెళ్లే బస్సులు, ఆటోలు, ద్విచక్ర వాహనదారులు ఈ రోడ్డుపై వెళ్లేందుకు తీవ్ర అవస్థలు పడ్డారు. ఇకపై ఇలా జరగకుండా చర్యలు చేపట్టాలని స్థానికులు కోరారు.

సంబంధిత పోస్ట్