చెన్నైలో శలగపేట వాసి మృతి

సంతబొమ్మాళి మండలం పెద్దమర్రిపాడు పంచాయతీ శలగ పేటకు చెందిన తామడ సింహాచలం (53) చెన్నైలో శనివారం మృతి చెందారు. గ్రామస్థులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. సింహాచలం జీవనోపాధి నిమిత్తం చెన్నైలోని బిపిసిఎల్ కంపెనీలో ఓ కాంట్రాక్టర్ వద్ద పైప్ లైన్ పనులు నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నారు. శనివారం విధులకు వెళ్లి పైప్ లైన్ పనిచేస్తుండగా తీవ్రంగా గాయపడి మృతి చెందారు. దింతో గ్రామస్తులు విషాదంలో మునిగిపోయారు.

సంబంధిత పోస్ట్