టెక్కలి మండలంలో జాతీయ రహదారిపై శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో డ్రైవర్ కు తీవ్ర గాయాలయ్యాయి. కే కొత్తూరు వద్ద జాతీయ రహదారిపై ముందు వెళ్తున్న లారీని ఓ బొలెరో వాహనం ఓవర్ టేక్ చేసే క్రమంలో ఢీ కొట్టినట్లు స్థానికులు వివరించారు. ఈ ప్రమాదంలో డ్రైవర్ కు గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న హైవే పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం టెక్కలి ప్రభుత్వాసుపత్రికి తరలించారు.