శునకాలతో హాడలెత్తిపోతున్న టెక్కలి ప్రజలు

టెక్కలి మేజర్ పంచాయతీలో శుక్రవారం రాత్రి కుక్కలు గుంపులు గుంపులుగా సంచరిస్తూ రోడ్లపై ప్రయాణించే వాహనదారులను, బాటసారులను భయాందోళనకు గురిచేస్తున్నాయి. గతంలో కూడా గుంపులుగా తిరుగుతూ చాలామందిని కరవడంతో ఆసుపత్రిపాలైన సంఘటనలు కూడా చాలా ఉన్నాయి. రోడ్లపై గుంపులుగా తిరిగే శునకాలను చూసి ప్రజలు హడలెత్తి పోతున్నారు. గ్రామపంచాయతీ అధికారులు స్పందించి ఈ శునకాల బారి నుండి ప్రజలకు రక్షణ కల్పిస్తారని కోరుకుంటున్నారు.

సంబంధిత పోస్ట్