టెక్కలి: మానసిక సమస్యలతో వివాహిత ఆత్మహత్య

టెక్కలి సబ్ కలెక్టరేట్ సమీపంలో నివాసం ఉంటున్న సంపతిరావు దివ్య (28) అనే వివాహిత బుధవారం సాయంత్రం ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు టెక్కలి పోలీసులు తెలిపారు. ఆమె కొన్నాళ్లుగా మానసిక సమస్యలతో తీవ్రంగా బాధపడుతుందని బంధువులు తెలిపారు. భర్త శ్రావణ్ కుమార్ టెక్కలి తహశీల్దార్ కార్యాలయంలో కాంట్రాక్ట్ ఉద్యోగిగా విధులు నిర్వహిస్తున్నాడు. ఘటనపై ఎస్సై రాము కేసు నమోదు చేశారు.

సంబంధిత పోస్ట్