టెక్కలి మండలం గంగాధరపేట ప్రాథమిక పాఠశాలలో ఈ ఏడాది ఒక్క విద్యార్థే చదువుతుండే వాడు. జూన్‌లో జరిగిన బదిలీల్లో పాఠశాలకు వచ్చిన బుట్ట భవాని అక్కడి పరిస్థితిని చూసి చిన్నబోలేదు.ఆమె ఇచ్చిన భరోసాతో పిల్లల్ని ప్రైవేటు పాఠశాలకు పంపకూడదని గ్రామస్థులు తీర్మానించుకున్నారు. సమీపంలోని లక్ష్మీపురం గ్రామంలోని విద్యార్థుల్ని సైతం తమ పాఠశాలకే పంపాలని, ఆటో ఛార్జీలు చెల్లిస్తామని ఉపాధ్యాయురాలు భరోసా ఇచ్చారు. దీంతో 22 రోజుల్లో విద్యార్థుల సంఖ్య 20కి పెరిగింది. ఆమె చొరవను గుర్తించిన గ్రామస్థులు పాఠశాలకు బెంచీలు, గ్రీన్ బోర్డులు, మైక్‌సెట్, శుద్ధజల యంత్రం సమకూర్చడంతో పాటు పిల్లలు ఆడుకునేందుకు అవసరమైన ప్రైవేటు స్థలాన్ని అప్పగించి మైదానాన్ని సిద్ధం చేశారు. భవాని కృషిని జిల్లా విద్యాశాఖాధికారి తిరుమల చైతన్య అభినందిస్తూ శుక్రవారం పాఠశాలకు వచ్చి ఘనంగా సన్మానించారు.