శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలంలో ఎరువుల సరఫరాపై జాయింట్ కలెక్టర్ సోమవారం ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. హోల్‌సేల్ డీలర్ శ్రీరామరాజు గోడౌన్, గ్రోమోర్ సెంటర్ పరిశీలించి స్టాక్, రిజిస్టర్లను పరిశీలించారు. రైతులకు ఆధార్, పాసుబుక్ తప్పనిసరి అని స్పష్టం చేశారు. ఎరువుల పంపిణీ వ్యవస్థను పటిష్టం చేస్తామని తెలిపారు. రైతులు హర్షం వ్యక్తం చేశారు.