ప్రజా సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే కూన రవికుమార్ తెలిపారు. సోమవారం ఆమదాలవలస మున్సిపాలిటీలో ఎన్టీఆర్ భద్రత పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. నేరుగా లబ్ధిదారుల వద్దకే వెళ్లి పింఛన్లు అందజేసి, వారి జీవన విధానాన్ని అడిగి తెలుసుకున్నారు. పింఛన్ నగదును సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.