ఆముదాలవలస: షిరిడిసాయి ఆలయాల్లో భక్తిశ్రద్ధలతో గురుపౌర్ణమి పూజలు

గురుపౌర్ణమి సందర్భంగా షిరిడి సాయి మందిరాల్లో భక్తులు పాలాభిషేకాలు పుష్పాభిషేకాలు పూజలు నిర్వహించారు. గురువారం గురుపౌర్ణమి సందర్భంగా ఆముదాలవలస నియోజకవర్గ పరిధిలో షిరిడిసాయి మందిరాల్లో భక్తులు పూజలు అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఆముదాలవలస పట్టణ పరిధిలో మెట్టక్కివలస, ఊసావానిపేట, గేటు, వంశధార కాలనీలో ఉన్న షిరిడిసాయి ఆలయాల్లో భక్తులు పూజలు నిర్వహించారు. గురుపౌర్ణమి సందర్భంగా భజనలు నిర్వహించారు.

సంబంధిత పోస్ట్