ఆముదాలవలస శ్రీ వెంకటేశ్వర ఐటిఐ కాలేజ్ నందు కాకినాడ వికాస్ వారి ఆధ్వర్యంలో ఐటిసి ఐసుజు, హుండాయ్ ఇండస్ , డిస్కన్ మరియు పలు కంపెనీలు వచ్చి మెగా జాబ్ మేళా నిర్వహించారు. గురువారం ఆముదాలవలసలో జాబ్ మేళా కార్యక్రమంలో వెంకటేశ్వర ఐటిఐ, సిద్ధార్థ ఐటిఐ మరియు నారాయణ ఐటిఐ ల నుండి 146 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలోకాలేజ్ కరస్పాండెంట్ కూన భానోజీరావు, ప్రిన్సిపల్, బోధనా సిబ్బంది పాల్గొన్నారు.