ఆముదాలవలస: మున్సిపల్ కాంప్లెక్స్ లో ఆటోస్టాండ్ తో ఇబ్బందులు

మున్సిపల్ వాణిజ్యసముదాయంలో ఆటోలు పెట్టడంతో స్థానిక వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గురువారం ఆముదాలవలస ఐడిఎస్ఎంటీ వాణిజ్య సముదాయంలో వ్యాపారాలు అంతంతగా సాగుతూ ఉండటంతో పలువురు వ్యాపారులు ఖాళీ చేసి వెళ్ళిపోతున్నారు. దీంతో మున్సిపల్ కాంప్లెక్స్ లో వాణిజ్య గదులు వెలవెలబోతుండంతో వ్యాపారులు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు ఇదే సమయంలో ఆటోవాలాలు తమ ఆటోలు మున్సిపల్ కాంప్లెక్స్ లో స్టాండ్ గా మార్చి ఉంచడంతో మరింత వ్యాపారులు రగిలిపోతున్నారు.

సంబంధిత పోస్ట్