ఆముదాలవలస: బాల బాలికల రక్షణ కోసమే శక్తి యాప్ నిర్వహణ

ఆపద సమయంలో బాలబాలికలను రక్షించుకునేందుకు శక్తి యాప్ ను రూపొందించినట్లు శక్తి టీం హెచ్ సి తమ్మినేని అమ్మాజీ తెలిపారు. గురువారం ఆమదాలవలస మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో మహిళలకు అవగాహన కల్పించారు. ఈ యాప్ ను డౌన్లోడ్ చేసుకుని, ఆపదలో ఉన్నప్పుడు ఎస్ ఓ ఎస్ బటన్ నొక్కితే ఐదు నిమిషాలలో పోలీస్ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుంటారని వివరించారు. ప్రతి ఒక్కరూ ఈ యాప్ ను డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు.

సంబంధిత పోస్ట్