ఆముదాలవలస మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో సోమవారం సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న స్థానిక ఎమ్మెల్యే కూన రవికుమార్ ప్రభుత్వ శాఖలకు సంబంధించిన వివిధ అధికారులు సిబ్బందితో మాట్లాడారు. ప్రభుత్వం క్షేత్రస్థాయిలో అందిస్తున్న వైద్య సేవలపై ఆరా తీశారు. గ్రామీణ స్థాయిలో వైద్యులు ప్రభుత్వ వైద్య సేవలు అందించి మందులు సరఫరా చేయాలని సూచించారు. మౌలిక సదుపాయాలు మెరుగు పరచాలన్నారు.