ఆముదాలవలస: వైసిపి నాయకులు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు

ఆముదాలవలస టీడీపీ కార్యాలయంలో శనివారం మీడియా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జిల్లా టీడీపీ కార్యదర్శి మొదలవలస రమేష్ మాట్లాడారు. ఆముదాలవలస లో ఉన్న రైల్వే గోడౌన్ హరిశ్చంద్రపురం కు తరలి వెళ్ళిపోతుందంటూ ఆముదాలవలస నియోజకవర్గ వైసీపీనాయకులు చేస్తున్న ప్రచారాలలో వాస్తవంలేదని స్పష్టం చేశారు. వైసీపీనాయకుల దగ్గర ఆధారాలు ఉంటే చూపించాలని అన్నారు. సమావేశంలో బివి రమణమూర్తి, విశ్వనాథం, జి మురళి అప్పారావు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్