ఆముదాలవలస పట్టణంలోని పదో వార్డు వాంబే కాలనీలో ఓ ఇంటిలో గ్యాస్ లీకై ఇద్దరికి గాయాలయ్యాయి. గుంటుకు సరస్వతి టిఫిన్ వ్యాపారం చేస్తోంది. ఎప్పటిలాగే శుక్రవారం ఉదయం టిఫిన్ తయారు చేస్తుండగా గ్యాస్ లీకై ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఆమె గాయపడింది. విషయం తెలుసుకున్న ఎదురింట్లో నివసిస్తున్న కోలా మాధవరావు ఘటనా స్థలానికి వెళ్లి మంటలు అదుపు చేసేందుకు ప్రయత్నించగా అతనికి గాయాలయ్యాయి.