రొట్టవలస ఆశ్రమంలో భగవద్గీత జయంతి, మోక్షద ఏకాదశి వేడుకలు

రొట్టవలస శ్రీరామ- ఆనందాశ్రమము శ్రీ కోదండ రామాలయ ప్రాంగణంలో సోమవారం భగవద్గీత జయంతి, మోక్షద ఏకాదశి పురస్కరించుకొని భజన కార్యక్రమం, భగవద్గీత పారాయణ సత్సంగం నిర్వహించారు. ఆశ్రమ నిర్వాహకులు తొత్తడి వెంకటరమణ తెలిపిన వివరాల ప్రకారం, ఆశ్రమ కాలనీ హరే రామ భజన బృందం ఈ కార్యక్రమంలో పాల్గొంది. అనంతరం భక్తులకు ఏకాదశి తీర్థ- ప్రసాదములు అందజేసి, శ్రీరామచంద్రుని ఆశీస్సులు అందించారు. ఈ కార్యక్రమం ఆముదాలవలస, సరుబుజ్జిలి మండలంలో జరిగింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్