తండ్యాం పాఠశాల విద్యార్థులతో భోజనం చేసిన ఎమ్మెల్యే కూన

ఆముదాలవలస నియోజకవర్గ ఎమ్మెల్యే కూన రవికుమార్ గురువారం పొందూరు మండలంలో పర్యటించారు. ఈ సందర్భంగా తండ్యాo గ్రామంలో గల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన మెగా పేరెంట్స్, టీచర్స్ మీటింగ్ లో పాల్గొన్నారు. పాఠశాలలో విద్యాబోధన, మౌలిక సదుపాయాలకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇచ్చిందని అన్నారు. అనంతరం ఎమ్మెల్యే విద్యార్థులతో కలిసి భోజనం చేశారు.

సంబంధిత పోస్ట్