నరసన్నపేట మండలం బాడాం గ్రామంలో కొలువై ఉన్న శ్రీ గ్రామ దేవత తల్లి ఆలయ మొదటి వార్షికోత్సవాలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. రాష్ట్ర టిడిపి కార్యనిర్వహక కార్యదర్శి బగ్గు అర్చన ఆలయానికి చేరుకుని అమ్మవారికి పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో అన్న ప్రసాద కార్యక్రమం జరిగింది.