భద్రాద్రిలో ఆదివారo "భద్రాద్రి సాంస్కృతిక వారధి పాహి రామప్రభో" అనే పేరుతో సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో ఆముదాలవలస నియోజకవర్గం పరిధిలో గల పొందూరు మండలం లచ్చయ్యపేట గ్రామానికి చెందిన సనపల స్నేహాంజలి ప్రదర్శించిన భరతనాట్యం పలువురిని ఆకట్టుకుంది. స్నేహాంజలి ప్రదర్శనకు రామాలయం ట్రస్ట్ యాజమాన్యం ప్రశంసాపత్రం అందించి గౌరవ సత్కారం చేశారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ మెంబర్లు, కార్యదర్శులు పాల్గొన్నారు.