పొందూరు మండలం రాపాకలోని ఇండేన్ గ్యాస్ గోడౌన్ వద్ద మంగళవారం ప్రజలు సిలిండర్ల కోసం బారులు తీరారు. చాలా రోజుల క్రితం బుకింగ్ చేసుకున్నప్పటికీ డెలివరీ ఆలస్యం కావడంతో, ఖాళీ సిలిండర్లతో చాలామంది ఏజెన్సీ వద్దకు చేరుకుని ఇబ్బందులు పడుతున్నారు.