ఆముదాలవలస వయోడేక్ లో జలకళ

హిరమండలం బ్యారేజీ నుంచి వంశధార కుడి కాలువ ద్వారా సాగునీటిని అధికారులు విడిచిపెట్టడంతో ఆముదాలవలస వయోడెక్ లో ఆదివారం జలకళ సంతరించుకుంది. ఈ మేరకు స్థానిక రైతులు ఆనందం వ్యక్తం చేశారు. సుమారు 84 వేల ఎకరాలకు సాగునీరు కొరత తీరుతుందని అన్నారు. 2800 క్యూసెక్కుల నీటిని విడిచిపెట్టినట్లు వంశధార డి ఈ సరస్వతి వెల్లడించారు.

సంబంధిత పోస్ట్