నారాయణ ప్రైవేట్ ఐటీఐలో క్యాంపస్ ప్లేస్‌మెంట్ డ్రైవ్..30 మంది విద్యార్థులకు ఉద్యోగాలు

నారాయణ ప్రైవేట్ ఐటీఐ కళాశాలలో శుక్రవారం ఫైనల్ ఇయర్ ఐటీఐ ఎలక్ట్రీషియన్, ఫిట్టర్ విద్యార్థుల కోసం క్యాంపస్ ప్లేస్‌మెంట్ డ్రైవ్ విజయవంతంగా నిర్వహించారు. ఈ ప్లేస్‌మెంట్ డ్రైవ్‌లో నైపుణ్యం గల 30 మంది విద్యార్థులు ఎంపికయ్యారు. టీవీఎస్ ట్రైనింగ్ సర్వీసెస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ డ్రైవ్‌లో ఎంపికైన విద్యార్థులకు శ్రీ సిటీలోని ప్రముఖ కంపెనీలైన డైకిన్ ఏసీ, అపోలో టైర్స్, కోల్గేట్ కంపెనీలలో ఉద్యోగాలు లభించాయి. ఈ సందర్భంగా టీవీఎస్ ట్రైనింగ్ సర్వీసెస్ సీనియర్ రిసోర్సింగ్ మేనేజర్ సురేష్,కళాశాల డైరెక్టర్ రెడ్డి దినేష్,ప్రిన్సిపాల్ పి.శ్యాము పాల్గొన్నారు.ఉద్యోగాలు పొందిన విద్యార్థులకు కళాశాల యాజమాన్యం అభినందనలు తెలిపింది.

సంబంధిత పోస్ట్