లావేరు మండల కేంద్రంలో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1973-1980 లో 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదివిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ కలయిక ఆదివారం పాఠశాల ఆవరణలో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా వారంతా అలనాటి మధుర జ్ఞాపకాలను నెమరువేసుకొని, విద్య బుద్దులు నేర్పిన గురువులను స్మరించుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ పూర్వవిద్యార్థుల సహకారంతో ప్రభుత్వ పాఠశాలలు అభివృద్ధి చెందుతాయన్నారు. సుమారు 52 ఏళ్ల తరువాత కలుసుకోవడంతో వారంతా ఆనందంగా గడిపారు.