ఎచ్చర్ల: మాదకద్రవ్యాలు యువత జీవితాలను నాశనం చేస్తున్నాయి

మాదక ద్రవ్యాల వినియోగం వల్ల యువత తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారని ఎన్ఎస్ఎస్ జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ వనజ గురువారం సాయంత్రం ఎచ్చెర్ల మండలం పొన్నాడ డిగ్రీ కళాశాల విద్యార్థులతో కలిసి నిర్వహించిన అవగాహన ర్యాలీలో పేర్కొన్నారు. ఈగల్ టీం సభ్యుడు రామచంద్రన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ ర్యాలీలో, ఇటీవల కాలంలో డ్రగ్స్ వినియోగంపై యువతకు ఆసక్తి కల్పించేందుకు నేరగాళ్లు ప్రయత్నిస్తున్నారని, దీనిని అరికట్టాల్సిన అవసరం ఉందని ఆమె అన్నారు. యువత ఈ దురలవాట్లకు దూరంగా ఉండాలని ఆమె సూచించారు.

సంబంధిత పోస్ట్