ఎచ్చెర్ల నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో రహదారుల నిర్మాణాలు పూర్తి కావాల్సి ఉందని వాటిపై దృష్టి సారించాలని ఎమ్మెల్యే ఈశ్వరరావు తెలిపారు. మంగళవారం రణస్థల క్యాంపు కార్యాలయంలో ఆయనను జిల్లా ఆర్అండ్‌బి ఈఈ తిరుపతిరావు కలుసుకున్నారు. రహదారుల పనులకు నిధుల మంజూరుకు తనవంతు కృషి చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు.