రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా వితంతువులకు పెన్షన్లు అందిస్తుందని ఎమ్మెల్యే ఎన్ ఈశ్వరరావు తెలిపారు. శుక్రవారం ఎచ్చెర్ల మండలం కుశలాపురం పంచాయతీలో నూతనంగా మంజూరైన వితంతువు పెన్షన్లను ఆయన అందజేశారు. ఆయన మాట్లాడుతూ గతంలో భర్త మృతి చెందిన తర్వాత పింఛన్లు అందించడం జరిగేది కాదని అయితే నేడు కూటమి ప్రభుత్వం భర్త చనిపోయిన నెలరోజుల తర్వాత వెంటనే పింఛన్లో అందజేస్తున్నామన్నారు. అధికారులు, నాయకులు పాల్గొన్నారు.