ఎచ్చెర్ల మండలంలోని ఫరీద్ పేటలో శుక్రవారం మధ్యాహ్నం సత్తారు గోపి (46) దారుణ హత్యకు గురయ్యారు. గతంలో జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యా కమిటీ ఛైర్మన్‌గా పనిచేసిన గోపి, వైసీపీ ఎంపీపీ మొదలవలస చిరంజీవి అనుచరుడిగా ఉన్నారు. అతనిని టీడీపీకి చెందిన తొమ్మిది మంది హత్య చేశారని బంధువులు ఆరోపిస్తున్నారు. గోపిపై పాత కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఆయన భార్య గ్రామ ఉప సర్పంచ్.