రణస్థలం మాజీ జడ్పీటీసీ గొర్లె లక్ష్మణరావు గురువారం ఉదయం పాతర్లపల్లి గ్రామంలో మృతి చెందారు. జడ్పీటీసీగా పనిచేసిన రోజుల్లో మండల అభివృద్ధికి ఎంతో కృషి చేశారని స్థానిక వాసులు తెలిపారు. సమాచారం తెలుసుకున్న ఎమ్మెల్యే ఎన్ ఈశ్వరరావు తన ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఆయన మృతి పట్ల స్థానికులు నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులు మాట్లాడుతూ ఈరోజు మధ్యాహ్నం మూడు గంటలకు అంత్యక్రియలు జరుగుతాయన్నారు.