జి. సిగడాం: గంజాయి స్వాధీనం.. ఇద్దరు అరెస్టు

జి. సిగడాం మండలంలో గంజాయి తరలిస్తున్న ఇద్దరినీ అదుపులోకి తీసుకొని అరెస్టు చేశామని సీఐ అవతారం తెలిపారు. మంగళవారం సాయంత్రం మండలంలోని జగన్నాథం, పవన్ అనే ఇద్దరు వ్యక్తులు స్కూటీలో రెండు కిలోల 300 గ్రాముల గంజాయి రవాణా చేస్తుండగా పట్టుబడ్డారని ఆయన తెలిపారు. ఈ మేరకు వారి ఇరువురినీ అరెస్టు చేశామని తెలిపారు. గంజాయి రవాణాపై ప్రత్యేక నిఘా ఉంచామని ఎవరైనా రవాణా చేస్తే చర్యలు తీసుకుంటామన్నారు.

సంబంధిత పోస్ట్