జి. సిగడాం: రైతుల సమస్యలపై స్పందించిన ఎమ్మెల్యే

తమకు సాగునీరు అందడం లేదని దీనివలన ఖరీఫ్ పంటకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని జి. సిగడాం మండలం డీఆర్ వలస రైతులు ఎమ్మెల్యే ఈశ్వరరావు దృష్టికి తీసుకువచ్చారు. సోమవారం ఆయనను కలిసిన రైతులు వారు పడుతున్న ఇబ్బందులను తెలియజేశారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి తక్షణమే సాగునీరు అందించే దిశగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎటువంటి ఇబ్బందులు ఉన్న తన దృష్టికి తీసుకురావాలన్నారు.

సంబంధిత పోస్ట్